Header Banner

గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి భువనేశ్వరి భరోసా! కొమరవోలు ప్రజలకు హామీ!

  Fri Mar 07, 2025 14:15        Politics

కొమరవోలును ఎప్పుడూ మర్చిపోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఇవాళ(శుక్రవారం)పామర్రు మండలం దత్తత గ్రామమైన కొమరవోలు సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి సమావేశంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తుల వద్దకు వెళ్తూ భువనేశ్వరి ఆత్మీయంగా మాట్లాడారు. తమ సమస్యలను భువనేశ్వరి దృష్టికి కొమరవోలు గ్రామస్తులు తీసుకువచ్చారు. గత ఐదేళ్లుగా గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మత్తులు కూడా చేయలేదని గ్రామస్తులు తెలిపారు. గత ఐదేళ్లుగా సున్నావడ్డీలు రావడం లేదని డ్వాక్రా సంఘాల మహిళలు చెప్పారు. ‘కష్టాలను ఒరిమితో సహన శిలివై పూలబాటలో నడిచిన ఓమాత భువనేశ్వరమ్మ’’ అంటూ రచించిన కవిత్వాన్ని కానుకగా లక్ష్మీస్వరి నారా భువనేశ్వరికి అందజేశారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


కోమరవోలు రావడం సంతోషంగా ఉంది...
అనంతరం కొమరవోలు గ్రామస్తులను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడారు. ’నన్ను మేడం అని పిలవవద్దు నేను మీ భువనమ్మను’ అని చెప్పారు. కొమరవోలు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు అడిగినవి చిన్న చిన్న సమస్యలు అని చెప్పారు. ఇచ్చిన హామీలతోపాటు సమస్యలన్నింటిని.... సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలని.. వర్గాలను పక్కన పెట్టాలని సూచించారు. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండాలని అన్నారు. ఒకరికి భయపడి గ్రామస్తులు తల దించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పుట్టిన గ్రామానికి మనమందరం కలిసి మంచి చేసుకుందామని చెప్పారు. గ్రామంలో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిద్దామని నారా భువనేశ్వరి తెలిపారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది: కొమరవోలు గ్రామస్తులు
భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని కొమరవోలు గ్రామస్తులు తెలిపారు. దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరిలపై తమకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు. భువనేశ్వరి సేవలను తరతరాలుగా గుర్తించుకుంటామని చెప్పారు. ప్రజల తరఫున భవనమ్మకు పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా ధన్యవాదాలు తెలిపారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #komaravolu #Narabhuvaneswari #paryatana #todaynews #flashnews #latestnews